వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాసలోకి మరో ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలు జంప్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్: కాంగ్రెసుకు చెందిన మరో ఇద్దరు తెలంగాణ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి దూకడానికి సిద్ధమయ్యారు. కరీంనగర్ జిల్లా రామగుండం శాసనసభ్యుడు సోమారపు సత్యనారాయణ రేపు ఆదివారం ఉదయం 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సమక్షంలో తెరాసలో చేరడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా, వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ కాంగ్రెసు శాసనసభ్యుడు రాజయ్య కూడా తెరాసలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రేపు ఆదివారం ఆయన కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఆయన రేపు హైదరాబాదులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్ష ప్రారంభోపన్యాసంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంటున్నారు.

ఆలాగే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా త్వరలో కాంగ్రెసుకు రాజీనామా చేసి తెరాసలో చేరుతారని అంటున్నారు. ఆయన శనివారం తన నియోజకవర్గం కొల్లాపూర్ కార్యకర్తలతో మాట్లాడారు. రేపు ఆదివారం మరోసారి హైదరాబాదులో తన ముఖ్య అనుచరులతో సమావేశమై కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, తెరాసలో చేరే విషయంపై చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని భావిస్తున్న కాంగ్రెసు శాసనసభ్యులు తెరాసవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, తెరాసలో చేరాలని అనుకుంటున్న శాసనసభ్యుల విషయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి వచ్చింది.

కాగా, కాంగ్రెసుకు చెందిన ఇద్దరు తెలంగాణ పార్లమెంటు సభ్యులతో కూడా తెరాస నాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పార్లమెంటు సభ్యులకు గాలం వేసేందుకు తెరాస చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. తెరాసలో చేరే విషయంపై అనుకూలంగా గానీ ప్రతికూలంగా గానీ ఆ ఇద్దరు పార్లమెంటు సభ్యులు మాట్లాడలేదని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు ఇంతకు ముందు గాలం వేసిన తెరాస ఇప్పుడు కాంగ్రెసుపై దృష్టి సారించింది.

English summary
It is said that two mare Congress Telanagana MLAs are going to jump into TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X