హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంజినీరింగ్ ఫీజుల్లో కోటాల వారి తేడాలొద్దు: హైకోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Andhra Pradesh
హైదరాబాద్: ఇంజినీరింగ్ కళాశాలల్లోని ఫీజులపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు శనివారం కీలక తీర్పు చెప్పింది. ఫీజుల విధానంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ, బి కేటగిరీల్లో వేర్వేరుగా ఫీజులు నిర్ణయించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటాల మధ్య ఫీజు తేడాలు ఉండరాదని ఒకే ఫీజు విధానం ఉండాలని అభిప్రాయపడింది. 2010 ఫీజుల నిర్ణాయక కమిటీ(ఏఎఫ్ఆర్సీ) సిఫార్సులను కోర్టు చెల్లవని చెప్పింది. వాటిని రద్దు చేస్తున్నట్లు చెప్పింది. కళాశాల ఖర్చులను పరిశీలించి మార్చిలోగా కొత్త ఫీజు విధానాలు నిర్ణయించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యూనిఫాం ఫీజులు, కాలేజీ స్థాయని బట్టి ఫీజులు నిర్ణయించుకోవచ్చునని అభిప్రాయపడింది.

అలాగే ప్రతి ఏడాది డిసెంబర్లో సీజ్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని కోర్టు కోర్టు ఆదేశించింది. కాగా ఇటీవల ఇంజినీరింగ్ కళాశాలలు కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరి జిల్లాలోని కోట మండలంలోని విద్యానగర్‌లో ఉన్న ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు జాతీయ స్థాయి సదస్సు శనివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఐఈఈఈ కోర్సు గురించి చర్చిస్తారు.

English summary
High Court fired on engineering colleges fees. Court suggested do not make differences between management and convener quota fees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X