రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రణరంగం పోలవరం బస్సుయాత్ర, విద్యార్థుల అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Polavaram Project
రాజమండ్రి/ఖమ్మం: ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల పోలవరం వ్యతిరేక బస్సుయాత్ర శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పశ్చిమ గోదావరి - ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించినప్పటికీ యాత్ర రణరంగాన్ని తలపించింది. భద్రాచలం నుండి బస్సులో బయలుదేరిన తెలంగాణ విద్యార్థులను, లాయర్లను పోలీసులు జీలుగుమల్లి ఫారెస్టు చెక్ పోస్టు వద్ద అడ్డుకున్నారు. విద్యార్థులు, లాయర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇరవర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థులు, లాయర్లు పోలీసులకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమైక్యంగా ఉందామని చెబుతున్న వారు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని వారు ప్రశ్నించారు. తాము ఏమైనా పాకిస్తాన్ బార్డర్‌లోకి వచ్చామా అన్నారు.

పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ మిగిలిన వారు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. పోలవరం వద్దురా తెలంగాణ ముద్దురా, ఖబర్దార్ సీమాంధ్ర పెట్టుబడుదారుల్లారా అంటూ నినాదాలు చేశారు. పోలవరం ప్రాజెక్టు కడితే తమ గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని మేం కేవలం సైట్ చూడటానికి మాత్రమే వెళుతున్నామని తమకు మద్దతుగా వచ్చిన ఓయు జెఏసి, న్యాయవాదులకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్థానిక విద్యార్థులు హెచ్చరించారు.

అంతకుముందు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు భద్రాచలం నుంచి పోలవరం నుండి బస్సులో బయలుదేరారు. వీరికి పలువురు న్యాయవాదులు మద్దతు పలికారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి తెలంగాణ వారు వస్తే వారిని అడ్డుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఖమ్మం, పోలవరం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. జీలుగుమిల్లు పరిసరాల్లో 144వ సెక్షన్ విధించారు. విద్యార్థులు అశ్వారావుపేట మీదుగా వస్తుండటంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.

కాగా తెలంగాణ విద్యార్థులను జీలుగుమల్లి చెక్ పోస్టు వద్ద అడ్డుకోవడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖండించారు. ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించడానికి వెళ్లిన వారిని అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. సమైక్యంగా ఉందామని చెప్పే వారు అరెస్టు చేయించడం ఎంత వరకు సమంజసమన్నారు. రాజ్యాంగ బద్దంగా వెళ్లి చూసేందుకు వారికి హక్కు ఉందన్నారు.

English summary
Osmania University Polavaram Bus Yatra created very tension at West Godavari and Khammam borders. Police arrest Telangana students and lawyers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X