వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైకిల్‌పై కమిషనర్ రైడ్, కాలుష్య నివారణకు కొత్త పంథా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: నగరంలో కాలుష్యాన్ని నివారించేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్(జివిఎంసి) వినూత్ర ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. విశాఖలో కాలుష్యం ఎక్కువగా ఉంటుందని తేలడంతో కమిషనర్ రామాంజనేయులు ఇక నుండి మున్సిపల్ ఉద్యోగులు ప్రతి సోమవారం సైకిళ్ల పైనే కార్యాలయానికి రావాలని ఇటీవల ఆదేశించారు. ఆయన చెప్పినట్లుగానే ఉద్యోగులంతా సైకిళ్లపై వచ్చారు. మోటారు సైకిళ్లపై వచ్చిన వారిని లోపలకు అనుమతించలేదు. అంతేకాదు ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ కూడా సైకిల్ పైన వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం నగరంలో లక్షన్నర నుండి రెండు లక్షల వాహనాలు ఉండేవని ఇప్పుడు మూడున్నర లక్షలకు చేరుకున్నాయన్నారు. వాహనాలు పెరగటంతో కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఇక నుండి తాము ప్రతి సోమవారం కార్యాలయానికి సైకిళ్లపై రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

అంతర్జాతీయ స్థాయిలో విశాఖను సుస్థిర పట్టణంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తామన్నారు. తమ సైకిల్ యాత్ర ద్వారా ప్రజల్లో కూడా కాలుష్యంపై అవగాహన కల్పించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. కాగా మంగళవారం నుండి బీచ్ రోడ్డులో ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మోటారు వాహనాలను నిషేధించారు. బీచ్ రోడ్డులో సైక్లింగ్ చేయాలనుకునే వారికి ఉచితంగా అందించేందుకు వంద సైకిళ్లను కూడా జివిఎంసి సిద్ధం చేసింది. పాఠశాలలు ఎక్కువగా ఉన్నచోట కూడా వాహన రహిత ప్రాంతాలుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ చెప్పారు.

English summary
GVMC commissioner Ramanjaneyulu and employees came to office today on cycle for awaring vishaka people on pollution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X