హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్, కెసిఆర్: కాంగ్రెసుకు కొరకరాని కొయ్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao-YS Jagan
హైదరాబాద్: సమస్య సద్దుణగిందని భావించి పార్టీని, ప్రభుత్వాన్ని గాడిలో పెడదామని భావించిన ప్రతిసారీ కాంగ్రెసును మరో కొత్త సమస్య చుట్టుముడుతోంది. తెలంగాణ సకల జనుల సమ్మె సద్దుమణిగిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వానికే ఎసరు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణకు కసరత్తు చేస్తున్నారంటూ తెలంగాణ సకల జనుల సమ్మె ముగిసిన వెంటనే వార్తలు వచ్చాయి. తాము కుదురుకున్నట్లేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా భావించి ఉంటారు. సకల జనుల సమ్మె విరమణ వల్ల, పోలవరం టెండర్ల వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆత్మరక్షణలో పడినట్లు భావించారు. కానీ ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. ముగ్గురు కాంగ్రెసు శాసనసభ్యులు పార్టీని వీడి తెరాసలో చేరడంతో ప్రభుత్వ పరిస్థితి గందరగోళంలో పడింది.

అదే సమయంలో పార్టీని గాడిలో పెట్టడమే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులకు చెక్ పెట్టేందుకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యూహరచన చేశారని, దాన్ని అమలు పెట్టడానికి సమాయత్తమయ్యారని వార్తలు వచ్చాయి జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించడానికి బొత్స ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. తద్వారా వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులను భయపెట్టాలని కూడా ఆయన భావించినట్లు ఊహాగానాలు చెలరేగాయి. అయితే, దానికి బ్రేక్ వేస్తూ తెలంగాణ అంశం ముందుకు వచ్చి అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడింది. ముగ్గురు శాసనసభ్యుల వ్యవహారం బొత్స సత్యనారాయణకు కొరుకుడు పడని వ్యవహారంగా మారింది.

పరిస్థితి సద్దుమణగిందని భావిస్తున్న ప్రతి సందర్భంలోనూ వైయస్ జగన్ రూపంలో లేదా కెసిఆర్ రూపంలో కాంగ్రెసుకు గండం ముంచుకుని వస్తూనే ఉన్నది. ఈ ఇద్దరు నాయకులు కాంగ్రెసు పార్టీ నాయకత్వానికి కొరుకుడు పడని కొయ్యలుగా మారారు. కాంగ్రెసు పార్టీని, ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనీయకపోవడమే వారి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. వీలు చిక్కితే ప్రభుత్వాన్ని కూల్చేసి మధ్యంతర ఎన్నికల సమరానికి ప్రాణం పోయాలని కూడా వారు భావిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీవ్రమైన చిక్కుల్లో పడింది.

English summary
TRS president K Chandrasekhar rao and YSR Congress president YS Jagan became problematic to Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X