• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కారెక్కనున్న మరో ఆరుగురు టి - కాంగ్రెసు ఎమ్మెల్యేలు?

By Pratap
|

TRS Logo
హైదరాబాద్: కాంగ్రెసుకు చెందిన ముగ్గురు తెలంగాణ శానససభ్యులు తమ పార్టీలో చేరడంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు చంకలు గుద్దుకుంటున్నారు. కాంగ్రెసుకు చెందిన మరో ఆరుగురు తెలంగాణ శాసనసభ్యులు తమ పార్టీలోకి వస్తున్నారని తెరాస నాయకులు చెబుతున్నారు. అయితే, వారి పేర్లు వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు. తగిన సమయంలో ఆ ఆరుగురు శాసనసభ్యులను పార్టీలో చేర్చుకుంటామని వారంటున్నారు. అయితే, తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కూడా అంటున్నారు.

కాంగ్రెసుకు షాక్ తగలడం ఖాయమని, మరో ఐదారుగురు శానససభ్యులు తమ పార్టీలోకి వస్తున్నారని, తగిన సమయంలో వారి పేర్లను వెల్లడిస్తామని తెరాస నాయకులు అంటున్నారు. మరింత మంది కాంగ్రెసు తెలంగాణ శానససభ్యులు తమ పార్టీలోకి వస్తారని తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు ముగ్గురు శానససభ్యులను తన పార్టీలోకి ఆహ్వానించే సందర్భంలో చెప్పారు. అయితే ఆయన ఎంత మంది వస్తారనే విషయం చెప్పలేదు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసే కొద్దీ తమ పార్టీలోకి వలసలు పెరుగుతాయని తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. కొత్తగా తెరాసలోకి వచ్చిన ముగ్గురు శాసనసభ్యులు కూడా అదే విషయం చెబుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The TRS leaders, who are in an upbeat mood after three senior Congress MLAs joined their party, claim that about half a dozen T-Congress MLAs are still waiting to join them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more