• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాకు ఏ పార్టీ రంగు అంటించకండి: లక్ష్మణ్ బాపూజీ

By Srinivas
|

Konda Laxman Bapuji
న్యూఢిల్లీ: తమకు ఏ పార్టీ రంగు అంటించ వద్దని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మంగళవారం అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ లక్ష్మణ్ బాపూజీ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆన మాట్లాడారు. తమకు ఏ పార్టీ రంగును అంటించ వద్దన్నారు. తాము ఏ పార్టీతోనూ కలవమన్నారు. తమతో కలిసి వచ్చే వారిని కలుపుకు వెళతామన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీలకు, జెండాలకు అతీతంగా తాము ఉద్యమిస్తామన్నారు.

కాగా బాపూజీ సత్యాగ్రం ఈ నెల 7వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈయన దీక్షకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ గద్దర్, తెలంగాణ తెలుగుదేశం, తెలంగాణ కాంగ్రెసు పార్టీ ఎంపీలు మద్దతు పలికారు. బాపూజీతో పాటు పదిమంది స్వతంత్ర సమరయోధులు దీక్షలో పాల్గొన్నారు.

English summary
Konda Laxman Bapuji said today that they will not related to any political party. They fight for Telangana without party and flag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X