వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ పెట్రో మంట, పెట్రోల్ ధర పెంపు యోచన

By Pratap
|
Google Oneindia TeluguNews

Petrol bunk
న్యూఢిల్లీ: పెట్రోల్ ధర మళ్లీ పెరగనుంది. పెట్రల్ ధరను లీటరుకు రూ.1.82 పైసలు పెంచాలని ప్రభుత్వం ఆధ్వర్యంలోని సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయి. రూపాయి విలువ పడిపోయినందున, ముడి చమురు ధరలు పెరిగినందు వల్ల పెట్రోల్ ధర పెంచాలని ప్రభుత్వ చమురు కంపెనీలు అడుగుతున్నాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు సెప్టెంబర్ నెలలో లీటరుకు ఐదు రూపాయలు పెంచాయి. మళ్లీ ఇంతలోనే పెట్రోల్ ధర పెంచేందుకు సిద్ధపడ్డాయి.

ఈ రోజు నుంచి పెట్రోల్‌పై నష్టాలు వస్తాయని, దాన్ని అధిగమించడానికి తాము పెట్రోల్ ధర పెంచాల్సి వస్తోందని హెచ్‌పిసిఎల్ డైరెక్టర్ (ఆర్థిక) బి. ముఖర్జీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ 108 అమెరికా డాలర్లు పలుకుతోందని, డాలరు విలువ రూ. 46.50 పైసలకు పడిపోయిందని, ఇది మూడు నెలల క్రితం 49 రూపాయలు ఉందని ఆయన అన్నారు. లీటరు పెట్రోల్‌పై ఇప్పుడు రూ. 1.50పైసలు నష్టం వస్తోందని ఆయన అన్నారు.

English summary
State-owned oil companies are pressing for a Rs 1.82 per litre increase in petrol prices because of rupee depreciation and hardening of crude oil prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X