వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డర్టీ పిక్చర్‌పై కోర్టుకెక్కనున్న సిల్క్ స్మిత సోదరుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Dirty Picture
హైదరాబాద్: విద్యాబాలన్ నటించిన డర్టీ పిక్చర్ సినిమాపై మరో వివాదం చెలరేగుతోంది. దక్షిణాది తార సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విద్యాబాలన్ సిల్క్ స్మిత పాత్రను పోషించింది. డర్టీ పిక్చర్ సినిమాపై సిల్క్ స్మిత సోదరుడు నాగవరప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. అతను బుధవారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వివిధ తెలుగు టీవీ చానెళ్లతో మాట్లాడుతూ సినిమాపై తన అభ్యంతరరాలను తెలిపాడు. సినిమా విడుదలను ఆపేయాలని కోరుతూ తాను రేపు గానీ ఎల్లుండి గానీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని అతను చెప్పాడు. తన సోదరి సిల్క్ స్మితను సినిమాలో అసభ్యకరంగా చూపించారని అతను ఆరోపించాడు. సినిమాకు సంబంధించినవారికి నోటీసులు ఇచ్చామని, ఎవరూ తమకు సమాధానం ఇవ్వలేదని, దీంతో హైకోర్టును ఆశ్రయిస్తున్నామని అతను చెప్పాడు.

తాను కొన్ని ట్రయలర్స్ చూశానని, పోస్టర్లు చూశానని, వాటిని చూసినప్పుడు అసభ్యకరంగా కనిపించాయని అతను అన్నాడు. తన సోదరి సిల్క్ స్మితను అనుకరిస్తూ అసభ్యంగా దృశ్యాలను చిత్రీకరించారని అతను ఆరోపించాడు. సినిమాలో అభ్యంతరకర దృశ్యాలున్నాయని, అవాస్తవాలూ వక్రీకరణలూ ఉన్నాయని అతను అన్నాడు. సినిమాకు సంబంధించినవారు తమను సంప్రదించలేదని, ఏకపక్షంగా సినిమాను నిర్మించారని అతను అన్నాడు. సినిమాను నిర్మించినవారిని కలవడం తమకు కుదరదని అతను చెప్పాడు.

English summary
Silk Smitha's brother Nagavara Prasad opposed Vidyabalan acted Dirty Picture film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X