వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక ఆరోపణల కేసులో అసాంజ్‌కు చుక్కెదురు

By Pratap
|
Google Oneindia TeluguNews

Julian Assange
లండన్: లైంగిక నేరాల్లో విచారణకు వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజ్‌ను స్వీడన్‌కు అప్పగించాలని లండన్ హైకోర్టు బుధవారం ఆదేశించింది. స్వీడన్‌కు అప్పగించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆసాంజ్ చేసుకున్న అపీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. వికీలీక్స్ మాజీ మహిళా వాలంటర్లు చేసిన రేప్, లైంగిక దాడి ఆరోపణల కేసులో అసాంజ్‌ను విచారించాలని స్వీడన్ అధికారులు నిర్ణయించారు. ఓ మహిళను ఆసాంజ్ రేప్ చేశాడని, మరో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి.

తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఆరోపణలు చేశారని అసాంజ్ అన్నారు. తమ సంస్థ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నవారు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. లండన్ హైకోర్టు నిర్ణయంపై బ్రిటన్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని అసాంజ్ భావిస్తున్నారు.

English summary
WikiLeaks' founder Julian Assange should be extradited from Britain to Sweden to face questioning over alleged sex crimes, London's High Court ruled on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X