హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హీరోయిన్ ప్రియమణికి ఆకతాయిల వేధింపులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Priyamani
హైదరాబాద్: ప్రముఖ హీరోయిన్ ప్రియమణిని ఆకతాయిలు వేధించడంతో కూకట్ పల్లి పోలీసులు ఒకరిని గురువారం అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ప్రియమణికి పలువురు ఆకతాయిలు ఫోన్లు చేసి నిత్యం వేధిస్తున్నారు. అసభ్యక సంక్షిప్త సందేశాలు(ఎస్సెమ్మెస్‌లు) పంపి హరాస్ చేస్తున్నారు. ఆమె ఎన్నిసార్లు ఫోన్ నెంబర్లు మార్చినా ఆకతాయిల వేధింపులు మాత్రం ఆగలేదు. నిత్యం ఆమెకు ఫోన్లు చేసి, ఎస్సెమ్మెస్‌లు పంపించి వేధించడంతో ప్రియమణి మేనేజర్ హరి మౌఖికంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు విచారణ జరిపి ప్రియమణిని వేధిస్తున్న వారిలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

కాగా ప్రముఖ హీరో జగపతి బాబు సరసన పెళ్లైన కొత్తలో చిత్రం ద్వారా ప్రియమణి తెలుగుకు పరిచయమై ఆ తర్వాత టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. పెద్ద హీరోల అందరి సరసన నటిస్తోంది. గ్లామర్‌తో పాటు నటనకు ఆస్కారం ఉన్న సినిమాలను కూడా ఆమె ఎంచుకొంటుంది. జగపతి బాబు, ప్రియమణి కాంబినేషన్లో వస్తున్న క్షేత్రం చిత్రంలో ఆమె కుటుంబ ప్రేక్షకులకు దగ్గరవనుంది.

English summary
Kukatpally police arrest one young for harass Heroine Priyamani with Phone calls and sms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X