హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సోనియాకు అగ్ని పరీక్ష: జీవన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jeevan Reddy
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ ప్రజాప్రతినిధులు గురువారం వేరు వేరుగా తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. గత ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తెలంగాణ నినాదం కారణంగానే గెలిచిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంశం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి అగ్ని పరీక్ష అన్నారు. 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి వెనక్కి పోయిందని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెసు ప్రాంత మంత్రులను, శాసనసభ్యులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవమానపరుస్తున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు మహబూబ్ నగర్ జిల్లాలో అన్నారు. గతంలో చెన్నారెడ్డి పదవి కోసం తెలంగాణను తాకట్టు పెట్టారని విమర్శించారు.

పోలీసులతో ఉద్యమాన్ని అణిచి వేయలేరని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్షా శిబిరంలో అన్నారు. కేంద్రం తెలంగాణ ఇవ్వకుంటే పార్లమెంటు సెషన్లు అడ్డుకుంటామన్నారు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం ఆగే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ మంత్రులు కేవలం ప్రకటనలకే పరిమితవుతున్నారని మరో ఎంపీ రాజయ్య ధ్వజమెత్తారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధిస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రకటించాలన్నారు. 1969 నాటి ఉద్యమం ఇప్పుడు కాదన్నారు. మభ్య పెట్టాలని చూసినా అలాంటి వారెవరు ఇప్పుడు లేరన్నారు.

కాంగ్రెసు తెలంగాణ ఇవ్వకపోతే ఈ ప్రాంతంలో కనుమరుగు కావడం ఖాయమని ఎమ్మెల్యే చిరుముర్తి లింగయ్య అన్నారు. తాము తెలంగాణ రాష్ట్రం కొత్తగా అడగటం లేదని గతంలో ఉన్నదానినే అడుగుతున్నామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతూ అన్నారు. తనకు ఇంతగా మద్దతు రావడం చూస్తుంటే ఉత్సాహం పెరిగి పట్టుదల పెరుగుతోందన్నారు. తనను అరెస్టు చేసినా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. కాగా కోమటిరెడ్డి దీక్ష గురువారం మూడో రోజుకు చేరుకుంది.

English summary
Congress senior leader fires at high command for Telangana. Jeevan Reddy said today that Telangana issue is very critical to solve.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X