చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకాళహస్తిలో బాలయ్య పూజలు, టిడిపి ఘన స్వాగతం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
చిత్తూరు: హీరో నందమూరి బాలకృష్ణ శుక్రవారం శ్రీకాళహస్తిలో ముక్కంటికి పూజలు చేశారు. బాలయ్య హైదరబాదు నుండి ఉదయం శ్రీకాళహస్తి చేరుకోగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు త్రినేత్ర అతిథి గృహం వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి బాలయ్య ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో బాలయ్య రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆయనను ఆశీర్వదించి స్వామి వారి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందించారు.

అనంతరం బాలయ్య బుచ్చినాయుడు కండ్రిగలోని ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లారు. శుక్రవారం రాత్రి ఈ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకల్లో బాలయ్య పాల్గొంటారు. గతంలోనూ పలుమార్లు బాలయ్య శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్నారు. కాగా బాలకృష్ణ, నయనతార, అక్కినేని నాగేశ్వర రావు నటించిన శ్రీరామరాజ్యం త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే.

English summary
Balakrishna participated in rudrabhisekam at Srikalahasthi today. His Srirama Rajyam will release soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X