హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ అరెస్టు అవుతారన్న వార్తలు నమ్మొద్దు: జూపూడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jupudi Prabhakar Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టవుతారని వస్తున్న వార్తలను రాష్ట్ర ప్రజలు, వైయస్ జగన్ అభిమానులు ఎవరూ కూడా నమ్మవద్దని ఆ పార్టీ నేత, శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర రావు శుక్రవారం ఉదయం చెప్పారు. గుంటూరు జిల్లాలో ఈ నెల 15వ తేది నుండి జగన్ రెండో విడత ఓదార్పు యాత్ర నిర్వహిస్తారని చెప్పారు. కోనేరు ప్రసాద్, సూర్య అధినేత నూకారపు సూర్య ప్రకాశ్ రావును సిబిఐ అధికారులు విచారణకు పిలిచి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌ను కూడా అలాగే అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో జూపూడి వివరణ ఇచ్చారు.

కాగా జగన్‌ను ఆయన ఇంటి వద్ద జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి, శాసనసభ్యులు మేకపాటి చంద్రమోహన్ రెడ్డి, బాలరాజు, గుర్నాథ్ రెడ్డి తదితరులు కలిశారు. మరోవైపు జగన్ విచారణ నిమిత్తం కోఠి సిబిఐ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా అక్కడకు తరలి వచ్చారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
MLC Jupudi Prabhakar Rao condemned YSRC Party president YS Jaganmohan Reddy's arrest roumers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X