వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భరించలేం, యుపిఎ నుంచి తప్పుకుంటాం: మమతా

By Pratap
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee
న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపుపై తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. యుపిఎ తప్పిదాలను తాము భరిస్తూ ఉండలేమని, యుపిఎ తన పద్ధతిని మార్చుకోకపోతే తప్పుకుంటామని ఆమె హెచ్చరించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే తమ పార్టీ ప్రతినిధి బృందం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలుస్తుందని, యుపిఎ నుంచి తప్పుకోవాలనే నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు ప్రధానితో ఆ బృందం చర్చిస్తుందని ఆమె శుక్రవారం అన్నారు.

గత 12 నెలల్లో 11 సార్లు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడం అంగీకార యోగ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లోని ధరలు దేశంలోని ధరలను ప్రభావితం చేస్తాయనే విషయం తెలుసునని, అయితే విదేశీ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించడం లేదని ఆమె అన్నారు. కేంద్ర మంత్రి వర్గంలో తమ పార్టీ సభ్యుడు ఒక్కరే ఉన్నందున ప్రభుత్వం తమ మాట వినకపోవచ్చునని, అయితే తమకు పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెసు మద్దతు అవసరం లేదని, తాము సొంతంగా ప్రభుత్వన్ని నడపగలమని ఆమె అన్నారు.

English summary
Trinamool Congress chief Mamata Banerjee has taken a strong stance against the Centre's “unilateral” decision to hike petrol prices and warned that her party – the UPA's largest ally – was ready to leave the ruling combination if “things continued this way”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X