హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ వైఖరి తీసుకున్న డిఎస్పీ నళిని సస్పెన్షన్

By Pratap
|
Google Oneindia TeluguNews

DSP Nalini
హైదరాబాద్: తెలంగాణకు మద్దతు తెలుపుతూ సీమాంధ్ర అధికారులు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించిన డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ (డిఎస్పీ) నళిని సస్పెన్షన్‌కు గురయ్యారు. నళిని సస్పెండ్ చేయడాన్ని డిజిపి దినేష్ రెడ్డి సమర్థించుకున్నారు. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకే నళినని సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. తీవ్రమైన తప్పుడు ప్రవర్తనకు పాల్పడినందుకు నళినిని సస్పెండ్ చేస్తున్నట్లు అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ ఎస్‌ఎ హుడా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ కోసం తాను డిజిపి కార్యాలయంలో తన రాజీనామాను సమర్పించినట్లు నళిని నవంబర్ 1వ తేదీన మీడియా ప్రతినిధులకు తెలిపారు. పోలీసు శాఖలోని సీమాంధ్ర ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటానని కూడా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు డిసెంబర్ 9వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోతే ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని కూడా ప్రకటించారు.

English summary
A day after crime investigation department (CID) deputy superintendent of police D Nalini accused that her higher up officials belonging to seemandhra region harassed her, the officials of state police on Friday decided to suspend Nalini from the service for her alleged grave misconduct.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X