వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

32 నెలల తర్వాత జైలు నుంచి 'సత్యం' రాజు విడుదల

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్: హైదరాబాదులోని చంచల్‌గుడా జైలు నుంచి సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు నిందితుడు రామలింగరాజు శనివారం సాయంత్రం విడుదలయ్యారు. అరెస్టయి 32 నెలలు గడిచిన తర్వాత ఆయనకు జైలు నుంచి విముక్తి లభించింది. ఆయనతో పాటు ఎనమండుగురికి సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దాంతో రామలింగ రాజు విడుదలకు మార్గం ఏర్పడింది. రామలింగ రాజును జైలు నుంచి విడుదల చేయాలని సుప్రీంకోర్టు చంచల్‌గుడా జైలు అధికారులను ఆదేశించింది. బెయిల్ పత్రాలను రామలింగ రాజు తరఫు న్యాయవాదులు అధికారులకు అందించారు.

రామలింగరాజుతో పాటు ఆయన సోదరుడు రామరాజు, ఆడిటర్ వడ్లమాని శ్రీనివాస్ కూడా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన మీడియాతోనే కాకుండా ఎవరితోనూ మాట్లాడకుండా కారులో ఎక్కి ఇంటికి వెళ్లిపోయారు. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు 2009 జనవరి 9వ తేదీన అరెస్టయ్యారు. 2009 సెప్టెంబర్ 7వ తేదీన అనారోగ్యంతో ఆయన హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చేరారు. ఆ తర్వాత నవంబర్ 25వ తేదీన జైలుకు వెళ్లారు.

సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. రామలింగ రాజుతో పాటు ఆయన తమ్ముడు రామరాజు, వడ్లమాని శ్రీనివాస్‌కు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాసుపోర్టులను అధికారులకు స్వాధీనం చేయాలని, అలాగే కేసు విచారణ పూర్తి కానందున ట్రయల్ కోర్టుకు సహకరించాలనే షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం వారికి ఇచ్చింది.

English summary
Satyam Ramalinga Raju released from Chanchalguda jail in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X