వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రఖ్యాత గాయకుడు భూపేన్ హజారికా మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhupen Hazarika
ముంబై: ప్రముఖ సంగీత విద్వాంసుడు, గాయకుడు భూపేన్ హజారికా శనివారం కన్ను మూశారు. ఆయన వయస్సు 85 ఏళ్లు. చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూత్ర పిండాలు, శ్వాసకోశ సంబంధమైన సమస్యలతో ఆయన ముంబైలోని ఆస్పత్రిలో చేరారు. గత ఐదు నెలలుగా ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది.

హజారికా కవి, సంగీత కూర్పరి, గాయకుడు, నటుడు, జర్నలిస్టు, రచయిత, చిత్ర దర్శకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన కళాకారుడు. ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ అవార్డులు వచ్చాయి. సంగీత నాటక అకాడమీ రత్న అవార్డు, అస్సాం రత్న అవార్డు లభించాయి. భూపేన్ హజారికా 1926 సెప్టెంబర్ 8వ తేదీన అస్సాంలోని సాదియాలో జన్మించారు.

తన పన్నేండేళ్ల ప్రాయంలోనే ఆయన రెండో అస్సామీ సినిమా ఇంద్ర మలాతి అనే సినిమాలో పాట పాడారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బిఎ పూర్తి చేశారసు. రాజకీయ శాస్త్రంలో ఎంఎ పూర్తి చేశారు. హిందీ, బెంగాలీ, అస్సామీ సినిమాలకు ఆయన పని చేశారు. రుడాలీకి కూడా ఆయన పనిచేశారు.

English summary
Legendary singer and pride of India Bhupen Hazarika has passed away following prolonged illness. He has been in the Intensive Care Unit (ICU) since the past few days. He was 85.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X