హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షూటింగులో హీరోయిన్ శ్రియకు తెలంగాణ సెగ

By Pratap
|
Google Oneindia TeluguNews

Shriya
హైదరాబాద్: హీరోయిన్ శ్రియకు శనివారం తెలంగాణ సెగ తాకింది. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగును ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు అడ్డుకున్నారు. హైదరాబాదులోని రాజేంద్ర నగర్‌లో గల విశ్వవిద్యాలయంలో శ్రియా, ఓ క్యారెక్టర్ యాక్టర్ నటిస్తున్న దృశ్యాన్ని చిత్రీకిరంచే సమయంలో విద్యార్థులు అక్కడికి చేరుకుని విధ్వంసం సృష్టించారు. తెలంగాణ నినాదాలు చేస్తూ సినిమా షూటింగును అడ్డుకున్నారు. దాంతో శ్రియను సురక్షితంగా వ్యాన్‌లోకి సినీ యూనిట్ తీసుకుని వెళ్లింది. అయినా విద్యార్థులు వదిలి పెట్టలేదు.

శ్రియ ఎక్కిన వ్యాన్‌ను చుట్టుముట్టి జై తెలంగాణ నినాదాలు చేశారు. దాంతో శ్రియ వ్యాన్ దిగి విద్యార్థులతో కలిసి చేయేత్తి జై తెలంగాణ నినాదాలు చేశారు. దాంతో విద్యార్థులు శాంతించారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, తమను షూటింగ్ చేసుకోనివ్వాలని సినీ యూనిట్ చెప్పినా విద్యార్థులు వినలేదు. విద్యార్థులు షూటింగును అడ్డుకోవడంతో సినీ యూనిట్ తీవ్ర అసంతృప్తికి గురైంది. విద్యార్థులు శ్రియ కారుపై దాడి చేసినట్లు చెబుతున్నారు.

తాను భారతదేశంలో ఉన్నానని, తనకు ఎక్కడైనా తిరిగి అధికారం ఉందని శ్రియా తనపై దాడి జరిగిన అనంతరం ట్విట్టర్‌లో అన్నారు. తన కారుపై దాడి జరిగిందని, తన తలకు ఓ రాయి తగిలిందని, అయితే తనకు ఏ విధమైన ప్రమాదం జరగలేదని ఆమె రాసింది. తనకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, భద్రత లేదా అని ఆమె అడిగారు.

English summary
Telangana students obstructed Allari naresh cinema shooting at NG Ranga agricultural university. Shriya uttered Telangana slogans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X