• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నిట్ విద్యార్థి ఆత్మహత్య, గోదావరిలో ఏడుగురు గల్లంతు

By Srinivas
|

Warangal Map
వరంగల్/ఏలూరు: వరంగల్ జిల్లాలోని నిట్ విశ్వవిద్యాలయంలో ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న భరద్వాజ అనే విద్యార్థి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భరద్వాజ ఢిల్లీకి చెందిన విద్యార్థి. ఆల్ట్రా మెగా హాస్టల్ భవనంపై నుండి దూకి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ భవనం ఎనిమిది అంతస్తుల భవనం. భరద్వాజ ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

కాగా మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుగురు విద్యార్థులతో సహా లక్ష్మీ ప్రసన్న అనే ఉపాధ్యాయురాలు గల్లంతయ్యారు. పెరవలి మండలం కాకరపర్రు ప్రాంతంలో విహారం కోసం వెళ్లారు. స్నానం చేయడానికి గోదావరి నదిలోకి దిగిన వారు గల్లంతయ్యారు. మోహన్ అనే తొమ్మిదవ తరగతి విద్యార్థి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. గల్లంతైన మిగతా వారి కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, జాలర్లు గాలిస్తున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్ కూడా వెంటనే స్పందించి అధికారులను ఆదేశించారు. వీరంతా తణుకు మున్సిపల్ పాఠశాల నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది.

English summary
Warangal NIIT student Bharadwaj commited to suicide today. Six students and one teacher disappeared in Godavari river in West Goadavari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X