విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికలు ముఖ్యం కాదన్న బాబు, అవిశ్వాసానికి వెనక్కి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాసంపై వెనక్కి తగ్గుతున్నారా అంటే ఆయన మాటలు అవుననే చెబుతున్నాయి. సోమవారం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా పర్చూరులో పోరుబాటకు బయలుదేరే ముందు కృష్ణా జిల్లా గన్నవరంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం మధ్యంతర ఎన్నికలు ముఖ్యం కాదన్నారు. తనకు ఎన్నికల కంటే ప్రజా సమస్యలే ముఖ్యమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాం చీకటి పాలన అన్నారు. ప్రస్తుతం కూడా అదే చీకటి పాలన కొనసాగుతోందన్నారు. వైయస్ హయాం చీకటి కుంభకోణాలు ఇంకా చాలా ఉన్నయని ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తున్నాయన్నారు. వైయస్ అవినీతిలో పారిశ్రామికవేత్తలు, అధికారులు చిక్కుకున్నారన్నారు.

రైతుల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, కాంగ్రెసు హయాంలో ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. రైతుల కోసం నిరంతరం పోరాడుతామన్నారు. రైతు సమస్యలపై 21వ తేదిన జాతీయ స్థాయి నేతలతో మాట్లాడతామన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తాను రైతు పోరుబాట ప్రారంభించాక 93 కరవు మండలాలను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అవినీతిపై రాజీలేని పోరు చేస్తామన్నారు. భవానీ ద్వీపం ప్రైవేటీకరణపై పోరు సాగిస్తామన్నారు.

English summary
It seems, Telugudesam Party chief Nara Chandrababu Naidu step back on no confidence vote on CM Kiran Kumar Reddy government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X