వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటు ఎదుట సత్యాగ్రహం: కొండా లక్ష్మణ్ బాపూజీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Laxman Bapuji
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంటు ఎదుట నవంబర్ 22 నుండి తాను శాశ్వత సత్యాగ్రహం చేపడతానని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సోమవారం ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ నవంబర్ 1వ తేది నుండి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న ఆయన సోమవారం సాయంత్రం విరమించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో కేంద్రం తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో అత్యధిక సభ్యులు తెలంగాణకు మద్దతు పలుకుతున్నప్పటికీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర బిల్లు పెట్టక పోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానం, అవహేళన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరాశ చెంది ఆత్మహత్యలు చేసుకునే వైఖరిని దూరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకే జెండా, ఒకే అజెండాతో తెలంగాణ కోసం ఉద్యమించే వారంతా ఒకే గొడుగు కిందకు రావాలన్నారు. అలాంటి కార్యకర్తలే ప్రస్తుతం ఉద్యమానికి అవసరమన్నారు. తెలంగాణ వచ్చే వరకు వివిధ రూపాల్లో ఉద్యమం కొనసాగిస్తానని చెప్పారు. రాజకీయ పార్టీలో తమతో కలిసి రాకపోవడం విచారకరమన్నారు. ధైర్యంతో గుండెబలంతో హింసాత్మక వైఖరి లేకుండా శాంతియుతంగా లక్ష్యాన్ని సాధించాలన్నారు. తెలంగాణ సాధిస్తాం, అనుభవిస్తాం అన్న నినాదంతో ముందుకు సాగాలని చెప్పారు.

English summary
Konda Laxman Bapuji announced today in New Delhi that he is ready to satyagraha from November 22 till Telangana will come.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X