వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ గడ్డపై కేంద్రంపై శివాలెత్తిన ఎంపీ మధు యాష్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ సోమవారం కేంద్రంపై న్యూఢిల్లీలోనే తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కోసం వారం రోజుల నుండి దీక్ష చేస్తున్న ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీకి ఆయన సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రం తెలంగాణ ప్రజలను బకరాలను చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణ వచ్చే వరకు పోరాటం ఆపేది లేదన్నారు.

తెలంగాణ కోసం తొమ్మిది మంది పార్లమెంటు సభ్యులం పార్టీని, పదవులను వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవసరమైతే లక్ష్మణ్ బాపూజీ ఆధ్వర్యంలో జెండాలు పక్కన పెట్టి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. బాపూజీ దీక్షకు మంత్రి శంకర్ రావు సంఘీభావం తెలిపారు. కేంద్రం గతంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణను ప్రకటించాలన్నారు. లక్ష్మణ్ తెలంగాణకు బాపూజీ అని కొనియాడారు. కాగా హైదరాబాదులోనూ కాంగ్రెసు సీనియర్ నేత జి వెంకట స్వామి(కాకా) కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. తన ఆరోగ్యం బాగుపడ్డాక తడాఖా చూపిస్తాననీ హెచ్చరించారు.

English summary
Nizamabad MP Madhu Yashki lashes out at central government today. He said T-mps are ready to leave party for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X