వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఇవ్వకున్నా ఓకే: కెసిఆర్‌పై మందకృష్ణ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
న్యూఢిల్లీ: సామాజిక తెలంగాణ కాని పక్షంలో తెలంగాణ ఇవ్వకపోయినా మంచిదేనని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సోమవారం అన్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రానికి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కూడా సామాజిక తెలంగాణ అవసరం లేదని అందుకే కాంగ్రెసుతో రహస్య ఒప్పందం కుదుర్చుకొన్నారని ఆరోపించారు. వారి రహస్య ఒప్పందం కారణంగానే తెలంగాణ ఆలస్యమవుతుందన్నారు.

బాపూజీ దీక్షకు టిఆర్ఎస్ మద్దతివ్వక పోవడాన్ని, కేంద్రం ఆయన దీక్షకు స్పందించక పోవడాన్ని చూస్తుంటేనే వారి చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందన్నారు. తెలంగాణకు కాంగ్రెసు ప్రధాన శత్రువు అన్న తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, కెసిఆర్ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్షకు ఎందుకు మద్దతు పలికారన్నారు. కోమటిరెడ్డి పార్టీకి రాజీనామా చేయలేదని అలాంటప్పుడు కాంగ్రెసు వ్యక్తిని ఎలా సమర్థిస్తున్నారన్నారు. ఎందుకంటే టెండర్లు వగైరా జరగాల్సిన పనులు తమకు జరుగుతున్నాయి కాబట్టే కాంగ్రెసుతో కలిసి తెలంగాణకు అడ్డుపడుతున్నారని విమర్శించారు.

English summary
MRPS president Manda Krishna Madiga fired at TRS chief K Chandrasekhar Rao today for his attitude. He accused that KCR secret agreements with Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X