హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఆస్తుల కేసు: చిక్కుల్లో ఐఎఎస్ అధికారి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మరో ఐఎఎస్ అధికారి చిక్కుల్లో పడ్డారు. జగన్ ఆస్తుల కేసులో ఐఎఎస్ అధికారి ఎం. శామ్యూల్‌ను సిబిఐ అధికారులు ఆదివారంనాడు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన రెవెన్యూ శాఖలో ప్రిన్సిపుల్ సెక్రటరీగా పనిచేశారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పలు సంస్థలకు శామ్యూల్ ఆధ్వర్యంలోనే భూముల కేటాయింపులు జరిగాయి. దీంతో వైయస్ జగన్ కేసులో సాక్షిగా శామ్యూల్ వాంగ్మూలాన్ని సిబిఐ అధికారులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్‌తో పాటు వివిధ సంస్థలకు భూములు కేటాయించిన విషయంపై సిబిఐ అధికారులు దిల్‌కుషా అతిథి గృహంలో శామ్యూల్ నుంచి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో వాన్‌పిక్‌కు నిబంధనలు ఉల్లంఘించి 15 వేల ఎకరాల భూమి కేటాయించినట్లు వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. వాన్‌పిక్‌కు పలు రాయితీలను, మినహాయింపులను కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోనే జరిగినట్లు తెలుస్తోంది.

వాన్‌పిక్ ప్రమోటర్ నిమ్మగడ్డ ప్రసాద్ వైయస్ జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్ సంస్థలో 244 కోట్ల రూపాయలు, కార్మెల్ ఆసియాలో 20 కోట్ల రూపాయలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్ఫా విల్లాస్, ఆల్ఫా ఎవెన్యూస్, గిల్‌క్రిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి ప్రసాద్ సంస్థలు జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో వంద కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టినట్లు సమాచారం. ప్రతిగా ప్రసాద్‌కు నిజాంపట్నం, చిరాలా ఓడరేవు పోర్టులను ఇచ్చినట్లు చెబుతున్నారు. జగన్ కేసులో నిందితులకు భూముల కేటాయింపుపై సిబిఐ అధికారులు శామ్యూల్‌ను అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు.

English summary
Kadapa MP Y.S. Jagan Mohan Reddy seems to to be getting no reprieve from the CBI. The CBI sleuths, who stepped up their probe in the disproportionate assets case, questioned special chief secretary M. Samuel who was principal secretary in revenue department of Y.S. Rajasekhar Reddy's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X