హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కంపెనీల్లో కోల్‌కత్తా బోగస్ కంపెనీల నిధులు?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంస్థల్లోకి కోల్‌కత్తాలోని పలు బోగస్ సంస్థల నుంచి నిధులు మళ్లించినట్లు సిబిఐ గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు హైదరాబాదుకు చెందిన ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక కథనం ప్రకారం - నల్లధనాన్ని వైట్ చేయడానికి కోల్‌కత్తాలో పలు బోగస్ సంస్థలు ఏర్పాటై ఆంధ్రప్రదేశ్‌లోని సంస్థల్లోకి మళ్లించినట్లు సిబిఐ గుర్తించింది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ కంపెనీలను వాడుకున్నట్లు చెబుతున్నారు.

దాదాపు 22 కంపెనీలు, చాలా వరకు కోల్‌కత్తాకు, కొన్ని రాజ్‌కోట్, బెంగళూర్, ఢిల్లీ, తమిళనాడుకు చెందన చెందిన సంస్థలు 2008 - 2010 మధ్య కాలంలో 350 రూపాయల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయడం ద్వారా 195.7 కోట్ల రూపాయలను జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. కంపెనీలు కాగితాలకే మాత్రమే పరిమితమైనట్లు చెబుతున్నారు. నల్లధనాన్ని తెలుపు చేయడానికి ఆ కంపెనీలను సృష్టించారని అంటున్నారు.

ఆర్వోసి, పాన్ కార్డులు పొంది, ఉద్యోగులు, సేవకులు, డ్రైవర్లు, స్వీపర్లు డైరెక్టర్లుగా ఆ కంపెనీలను పుట్టించినట్లు చెబుతున్నారు. డబ్బుల మళ్లించడానికి ఆ కంపెనీలు షేర్లకు దరఖాస్తు చేశాయని అంటున్నారు. ఆ పత్రిక కథనం ప్రకారం - ఈఆర్ఇఎస్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ జగతిలో 2008 ఫిబ్రవరి 18వ తేదీన 8 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఆర్టిలిజెన్స్ బయో ఇన్నోవేషన్స్ లిమిటెడ్, కీర్తి ఎలెక్టోర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాక్ నెట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, డెల్టన్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి జగన్ బోగస్ కంపెనీలకు చిరునామాలు కూడా లేవని అంటున్నారు. ఒక్క కంపెనీలోని డైరెక్టర్లే చాలా వరకు ఇతర కంపెనీల్లో కూడా డైరెక్టర్లుగా ఉన్నట్లు చెబుతున్నారు.

English summary
According to a news report - The Central Bureau of Investigation’s probe into the money trail from Kolkata-based bogus companies into firms belonging to Kadapa MP Y.S. Jagan Mohan Reddy is growing stronger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X