హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి పిఎ అలీఖాన్ ప్రాణాలకు ముప్పు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: అక్రమ మైనింగ్ కేసులో జైలులో ఉన్న కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పిఎ) మెహతూజ్ అలీఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని సిబిఐ భావిస్తున్నట్లు వార్తాకథనాలు వస్తున్నాయి. అలీఖాన్ జాడ తెలియడం లేదు. అతను విదేశాలకు పారిపోయాడా, దేశంలోనే ఉన్నాడా అనే విషయం కూడా ఆంతుబట్టడం లేదు. అతని కోసం సిబిఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి, అంతర్జాతీయ విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది. అయినా అలీఖాన్ ఆచూకీ తెలియడం లేదు.

అలీఖాన్ 2010 మే 13వ తేదీన పాస్‌పోర్టు పొందాడు. అక్రమ మైనింగ్‌లో అలీఖాన్ ముఖ్యమైన లింక్ అని సిబిఐ భావిస్తోంది. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన అలీఖాన్ బళ్లారికి చెందినవాడు. ఖాన్ దేవీ ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీని స్థాపించాడు. అది గాలి జనార్దన్ రెడ్డి బినామీ కంపెనీ అని సిబిఐ భావిస్తోంది. దీంతో పాటు మరో కంపెనీ ఆర్‌కె మైనింగ్ కర్ణాటకలో ఇతర గనులకు కంట్రాక్టులను సాధించి పెట్టింది. దేవీ ఎంటర్‌ప్రైజెస్ చెల్లింపులు జరుపుతూ వచ్చింది. గత ఐదేళ్లుగా ఖాన్ గాలి జనార్దన్ రెడ్డి వద్ద పనిచేస్తున్నాడు. గతంలో ఆదాయం పన్ను శాఖ అధికారులు అలీఖాన్ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో అధికారులకు చెల్లించిన ముడుపుల వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Jailed mining baron Gali Janardhan Reddy’s personal assistant Mehfuz Ali Khan, who is wanted by the CBI, is still missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X