వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ కౌంటర్: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు గైర్హాజర్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తన వర్గానికి చెందిన ఏడుగురు శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసులోకి వెళ్తారని ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కౌంటర్ వ్యూహరచన చేశారు. తన వర్గానికి చెందిన శాసనసభ్యులెవరూ శాసనసభకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు చేసిన ప్రకటన ఆ విషయాన్ని తెలియజేస్తోంది. రాజీనామా చేసిన తర్వాత శాసనసభకు వెళ్లడం నైతిక కాదని, అందువల్ల తన వైయస్ వర్గానికి చెందిన శాసనసభ్యులు శాసనసభా సమావేశాలకు దూరంగా ఉంటారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

తమ వర్గానికి చెందిన శాసనసభ్యులు పదవులకు, కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారని, కాబట్టి శాసనసభకు వెళ్లరని ఆయన అన్నారు. జగన్ వైపు వెళ్లిన శాసనసభ్యుల్లో ఏడుగురు తిరిగి కాంగ్రెసులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వారి పేర్లు బయటపెడితే వారితోనే తాము జగన్ వైపే ఉన్నామని బహిరంగంగా చెప్పిస్తామని ఆయన సవాల్ చేశారు. ఐదేళ్ల కోసం ఎన్నికైన కాంగ్రెసుకు ఈ సమావేశాలే చివరివి కావచ్చునని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీలో పడిందని ఆయన అన్నారు.

English summary
YSR Congress party leader Jupudi Prabhakar Rao said that YS Jagan camp MLAs will not attend Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X