వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసెంబర్ 1 వరకు జైల్లోనే కనిమొళి, విచారణ వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanimozhi
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఇరుక్కున్న డిఎంకె పార్లమెంటు సభ్యురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ముద్దుల కూతురు కనిమొళికి ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. డిసెంబర్ 1వ తేదీ వరకు ఆమెకు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి. కనిమొళితో పాటు మరో ముగ్గురు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణను డిసెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్లను రెండు రోజుల క్రితం ప్రత్యేక కోర్టు తోసిపుచ్చడంతో కనిమొళితో పాటు మరో ముగ్గురు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు.

కనిమొళి బెయిల్ పిటిషన్‌తో పాటు డిఎంకె ఆధ్వర్యంలోని కలైంగర్ టీవి ఎండి శరద్ కుమార్, కుసేగావ్ ఫ్ర్టూట్స్ అండ్ వెజిటెబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఆసిఫ్ బాల్వా, రాజీవ్ అగర్వాల్‌ల బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. మే 20వ తేదీన అరెస్టయినప్పటి నుంచి కనిమొళి తీహార్ జైలులో ఉంటున్నారు.ట సిబిఐ అభ్యంతరం చెప్పకపోయినప్పటికీ ట్రయల్ కోర్టు నవంబర్ 3వ తేదీన కనిమొళికి బెయిల్ నిరాకరించింది.

English summary
The Delhi High Court on Wednesday adjourned till Dec 1, the bail plea of DMK MP Kanimozhi and three others, arrested for their alleged roles in the 2G spectrum allocation case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X