హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపీల ఒత్తిడితో నిమ్స్‌లో కోమటిరెడ్డి దీక్ష విరమణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komatireddy Venkat Reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల ఒత్తిడి మేరకు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం తన దీక్ష విరమించనున్నారని సమాచారం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన తొమ్మిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, ఎంపీల ఒత్తిడి మేరకు ఆయన నిమ్స్‌లోనే బుధవారం తన దీక్షను విరమించనున్నారని తెలుస్తోంది. తెలంగాణ కోసం పార్లమెంటు ఎదుట ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి తల్లిచే నిమ్మరసం ఇప్పించి దీక్ష విరమింప చేసే అవకాశముంది.

ఎంపీలు, కుటుంబ సభ్యులతో పాటు ఆయనను కలవడానికి వచ్చిన పలువురు నేతలంతా దీక్ష విరమించాలని కోరుతున్నారు. బుధవారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆయనను పరామర్శించారు. మీరు తెలంగాణ కోసం ఇప్పటికే చాలా త్యాగం చేశారని దీక్ష విరమించే ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు.

English summary
Former Minister Komatireddy Venkat Reddy will ready to withdraw his fast today. Congress MPs and family members pressured him to withdraw fast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X