వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్ ఫోటోతో నగ్నంగా పూనమ్, ఆకతాయి పని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Poonam Pandey
ముంబయి: భారత దేశం ప్రపంచ కప్ గెలిస్తే తాను తన దుస్తులు విప్పుతానని ప్రకటించిన పూనమ్ పాండే తీవ్రంగా అప్ సెట్ అయింది. అయితే కేవలం ఆమెనే కాదు భారతీయులందరినీ అది అప్ సెట్ చేస్తుందనే చెప్పవచ్చు. ఇన్నాళ్లు తన స్టేట్‌మెంట్లు, ట్వీట్స్‌తో అందరినీ అలరించిన పూనమ్ మాత్రం ఓ పోకిరీ చేసిన పనికి తీవ్రంగా అప్ సెట్ అయింది. ఓ అజ్ఞాత వ్యక్తి క్రికెట్ గ్రౌండ్‌లో పూనమ్ పాండేను పూర్తిగా నగ్నంగా చిత్రీకరించి ఆమె చేతిలో సచిన్ టెండుల్కర్ చిత్రాన్ని ఉంచాడు. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో చక్కెర్లు కొడుతోంది. ఈ ఫోటోను చూసిన పూనమ్ తీవ్రంగా అప్‌సెట్ అయింది. రాయడానికి కూడా ఆ ఫొటో అభ్యంతరకరంగా ఉంది.

దానిపై తీవ్రంగా అప్‌సెట్ అయిన పూనం పాండే వెంటనే తన ట్విట్టర్‌లో ఇలా రాసింది. తన అభిమానులు తన పట్ల చూపించే అభిమానానికి తాను ఎంతో ఆనందిస్తున్నానని, అయితే ఇలాంటి ఫోటోలు పెట్టడం తనను చాలా బాధించాయని రాసింది. తన పైన ఇదివరకు ఎన్నో ఫోటోలు చూశానని అయితే తాను ఎప్పుడూ హర్ట్ కాలేదని, క్రికెట్‌ను ఒక మతంగా ప్రేమించే మన దేశంలో ఇలాంటివి చేయడాన్ని మాత్రం తనను హర్ట్ చేసిందని రాసింది. ఇక ముందు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది. కాగా గతంలో పూనం పైన ఎన్నో ఫోటోలు, కామెంట్లు వచ్చినప్పటికీ ఆమె వ్యతిరేకించిన దాఖలాలు లేవు. కానీ ఈ ఫోటోను చూసి మాత్రం ఆమె తీవ్ర ఆవేదన చెందడం గమనార్హం.

English summary
Poonam Pandey is one of India's new breed of celebrities who are famous for being famous not unlike the Kim Kardashians of the US. The bare all babe Poonam Pandey is miffed after her morphed nude picture has suddenly resurfaced on the cyberspace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X