వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాంబశివుడి హంతకుల హత్యకు సోదరుడి పథకం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sambasivudu
నల్లగొండ: మాజీ మావోయిస్టు నేత, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు సాంబశివుడు అలియాస్ కోనాపురి అయిలయ్యను హత్య చేశారని భావిస్తున్నవారి హత్యకు ఆయన తమ్ముడు రాములు పథకం రచించినట్లు చెబుతున్నారు. టీవీ చానెళ్లలో వస్తున్న వార్తల ప్రకారం - కిరాయి హంతకులను మాట్లాడి సోదరుడిని హత్య చేసినవారిని రాములు హత్య చేయించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు నమ్ముతున్నారు. సాంబశివుడి తమ్ముడు రాములు పరారీలో ఉన్నాడు. చిలకరాజు సురేష్ అనే వ్యక్తి సాంబశివుడి హత్యకు పథకం రచించినట్లు పోలీసులు చెబుతున్నారు. సాంబశివుడిని హత్య చేశాడని భావిస్తున్న వ్యక్తిని హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.

ఈశ్వర రెడ్డి, శివ, శేఖర్ రెడ్డి, అరుణ్ అనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారు వాడిన నాలుగు సెల్‌ఫోన్లను, రెండు కత్తులను, రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాంబశివుడిని ఈ ఏడాది మార్చి 26వ తేదీ రాత్రి 12 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. నల్గొండ జిల్లా వలిగొండ మండలంలో ధూంధాం కార్యక్రమానికి వెళ్లి ఇన్నోవా వాహనంలో మరో పది మందితో కలిసి తిరిగొస్తున్న సాంబశివుడిపై గోకారం వద్ద రెండు కార్లలో వచ్చిన పదిమంది వేటకొడవళు, గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన మరణించారు. సాంబశివుడు నల్లగొండ జిల్లాకు చెందినవారే. సాంబశివుడు మావోయిస్టు పార్టీలో చాలా కాలం పనిచేశారు.

English summary
It is said that TRS leader Samabasivudu was made murdered by his brother Ramulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X