హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగులో జివో జారీ చేసిన 'తమిళ' అధికారి రాధా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugu
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా రోజుల తర్వాత తెలుగులో మొదటి జివో(ప్రభుత్వ ఉత్తర్వు)ను జారీ చేశారు. విపత్తు నిర్వహణ కమిషనర్ రాధ తెలుగులో జివోను జారీ చేశారు. తెలుగులో జివోను జారీ చేసిన ఈ అధికారి తమిళనాడుకు చెందిన ఆంధ్ర ప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్ కావడం విశేషం. మన రాష్ట్రానికి చెందిన అధికారులు ఎందరో ఉన్నా ఇప్పటి వరకు తెలుగులో జివో జారీ చేసిన వారు దాదాపు లేరనే చెప్పవచ్చు. అయితే తమిళనాడుకు చెందిన ఈ అధికారి మాత్రం జివోలు మాతృభాషలో ఉంటే సామాన్యులకు కూడా అర్థమవుతుందనే ఉద్దేశ్యంతో ఇలా జారీ చేసినట్టు చెబుతున్నారు.

ఈ జివో కోసం తాము సుమారు పదకొండు నెలలు కష్టపడ్డామని అధికారి రాధ చెప్పారు. సిబ్బందికి తెలుగు టైపింగ్ నేర్పించామని, అందరూ నేర్చుకోవాలని సూచించినట్లు చెప్పారు. సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాను జివోను తెలుగులే జారీ చేసినట్లు చెప్పారు. దేశంలో చాలా రాష్ట్రాలు మాతృభాషలో ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఈ అలవాటు లేదు. అంతా ఇంగ్లీషులోనే. అయితే రాధ మాత్రం అందరికీ భిన్నంగా చేసి సంచలనం సృష్టించారు. మాతృభాషను అభిమానించాలని మిగిలిన అధికారులకు చెప్పకనే చెప్పారనుకోవచ్చు.

English summary
One Tamil AP IAS cadder officer issued go in Telugu. GO issued in telugu to understand local people easily, He said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X