వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరామర్శించలేదంటూ సిఎం కిరణ్‌పై కోమటిరెడ్డి గుర్రు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komatireddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మానవత్వం లేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం తొమ్మిది రోజుల పాటు దీక్ష చేసిన కోమటిరెడ్డి బుధవారం తన దీక్షను విరమించారు. ఈ రోజు(గురువారం) ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాటి శాసనసభ్యుడు దీక్ష చేస్తుంటే కిరణ్ కనీసం పలకరించలేదని విమర్శించారు. దీంతోనే తెలంగాణ పట్ల ఆయన వైఖరి ఏమిటో తెలిసి పోతోందన్నారు. కేంద్రం తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేస్తే ఊరుకునేది లేదన్నారు.

అలా చేస్తే ముందు ముందు ప్రమాదకర ఉద్యమాలు వస్తాయన్నారు. ఉద్యమాల వల్ల ఏం జరిగినా అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చల్లారలేదని మరో రూపంలోకి మారుతుందన్నారు. తాము తెలంగాణ తప్ప ప్రత్యేక ప్యాకేజీ, ఎస్సార్సీ వంటి వాటికి ఒప్పుకునేది లేదన్నారు. కేంద్రం త్వరలో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటే తమ అంతిమ లక్ష్యమన్నారు.

English summary
Former minister Komatireddy Venkat Reddy lashes out at CM Kiran Kumar Reddy today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X