హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎదురు తిరిగిన రెండో ఎస్సార్సీ, వెనక్కి తగ్గిన కాంగ్రెసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండు పరిష్కారానికి రెండో రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ కమిషన్‌ (ఎస్సార్సీ) వేయాలనే కాంగ్రెసు అధిష్టానం ఆలోచన బెడిసికొట్టింది. నిజానికి, రెండో ఎస్సార్సీ ఎజెండాను కావాలనే కాంగ్రెసు అధిష్టానం ముందుకు తెచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్రాల విభజనపై రెండో ఎస్సార్సీ వేయాలనేదే తమ పార్టీ విధానమని ఎఐసిసి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ చేత పార్టీ అధిష్టానమే చెప్పించినట్లు తెలుస్తోంది. దానిపై ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూసేందుకే అలా చేయించినట్లు సమాచారం. అయితే, ఒక్కసారిగా తెలంగాణ నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురైంది.

రెండో ఎస్సార్సీకి అంగీకరించేది లేదని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెసు స్టీరింగ్ కమిటీకి దూరంగా ఉంటున్న పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ కూడా అటువంటి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ కోసం తన సహ పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసినా ఆయన చేయలేదు. సర్వే సత్యనారాయణ వంటి వారి నుంచి కూడా వ్యతిరేకత ఎదురు కావడంతో కాంగ్రెసు అధిష్టానం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

రెండో ఎస్సార్సీ పార్టీ విధానమైనప్పటికీ అది తెలంగాణకు వర్తించదని కాంగ్రెసు తెలంగాణ నేతలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విభజన కిందికి రాదని, గతంలో ఉన్న రాష్ట్రాన్ని పునరుద్ధరించడమే అవుతుందని వారు వాదిస్తున్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ ఉండదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు తాజాగా చెప్పారు. మొత్తం మీద, తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలనే ఆలోచనను కాంగ్రెసు అధిష్టానం విరమించుకున్నట్లు తెలుస్తోంది.

English summary
It is said that Congress high command has reversed its proposal of second SRC on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X