• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైయస్ జగన్ సాక్షి కథనాలపై పయ్యావుల కేశవ్ ఫైర్

By Pratap
|

Payyavula Keshav
హైదరాబాద్: జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నీ ఉన్నాయంటూ సాక్షి దినపత్రికలో రాసిన వార్తాకథనంపై, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి సిబిఐకి రాసిన లేఖపై తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. జగన్ కార్పోరేట్ మాయాజాలాన్ని బయటపెట్టడానికి వంద లక్ష్మినారాయణలు కూడా సరిపోరని, అయితే పాపాలు పండినప్పుడు అన్నీ వెలుగులోకి వస్తాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆదాయం పన్ను శాఖ అధికారుల నివేదికను ఆయన జగన్ జగతి పబ్లికేషన్స్ వ్యవహారాలకు నిదర్శనంగా ఆయన చూపారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు కార్యాలయాలు, ఫోన్ సౌకర్యాలు కూడా లేవని ఆయన చెప్పారు. జగతిలో 25 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన సంస్థకు కార్యాలయం లేదని ఆయన అన్నారు.

జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నీ న్యాయమైనవే అయితే ఆ కంపెనీ ప్రతినిధులు ఎందుకు ముందుకు రావడం లేదని, వారు బయటకు వచ్చి అన్ని విషయాలు చెప్పవచ్చు కదా అని ఆయన అన్నారు. పెట్టుబడిదారుల గురించి ఐటి శాఖ అడుగుతున్న ప్రతిసారీ జగతి పబ్లికేషన్స్ వివరాలు అందిస్తూ వచ్చిందని ఆయన అన్నారు. ఐటి శాఖ ఆ సంస్థలకు రాసిన లేఖలు తిరిగి వస్తున్నాయని, వాటికి కనీసం ఫోన్ సౌకర్యం కూడా లేదని ఆయన అన్నారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని ఆయన విమర్శించారు. జగతిలో పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టినవారంతా జగన్ బంధువులు, మిత్రులు, సన్నిహితులేనని ఆయన అన్నారు. తాము రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకంలో వారందరి పేర్లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

జగతి పబ్లికేషన్స్ నష్టాల్లో ఉందని ఆదాయం పన్ను శాఖ చెబుతోందని, అటువంటప్పుడు భారీ పెట్టుబడులు ఎలా వస్తాయని ఆయన అన్నారు. కేవలం 8 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టిన జగన్‌కు 90 శాతం వాటా ఉంటే, 1200 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టినవారందరికీ కేవలం పదిశాతం వాటా మాత్రమే ఉందని, ఇది జగన్ కార్పోరేట్ మాయాజాలమని ఆయన అన్నారు. విజయసాయి రెడ్డికి తమ నుంచి ఏ విధమైన ముప్పు లేదని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసులో చివరి నిందితుడి వరకు హత్యకు గురి కావడంతో జగన్ కేసులో కూడా అలాగే జరిగే ప్రమాదం ఉందని తాము అనుమానాలు వ్యక్తం చేశామని ఆయన అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP leader Payyavula Keshav lashed out at YS Jagan' Sakshi investments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more