హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై పార్టీ అధిష్టానం మీద ధ్వజమెత్తిన కాకా

By Pratap
|
Google Oneindia TeluguNews

G Venkataswamy
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామి (కాకా) పార్టీ అధిష్టానంపై ధ్వజమెత్తారు. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ విషయంలో మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణపై అధిష్టానం వ్యవహారశైలి బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. అసలు అధిష్టానం వ్యవహరించే తీరే బాగా లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జోక్యం చేసుకోవాలని ఆయన సూచించారు. రెండో ఎస్సార్సీ అంటే తెలంగాణ అంశాన్ని పెండింగులో పెట్టడమేనని, వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే తాను రెండో ఎస్సార్సీని వ్యతిరేకించానని ఆయన అన్నారు. తెలంగాణపై తన ఉద్యమ కార్యాచరణను రేపు ప్రకటిస్తానని ఆయన చెప్పారు.

రెండో ఎస్సార్సీ, ప్రత్యామ్నాయం అంటూ తెలంగాణపై ఆలస్యం చేస్తే కాంగ్రెసును పాతేస్తామని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. హైదరాబాదులోని విద్యానగర్‌లో ఆయన శనివారం తెలంగాణ మజ్దూర్ యూనియన్‌ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ నుంచి ఆర్టీసికి వచ్చే ఆదాయాన్ని ఇక్కడి ఆర్టీసి అభివృద్ధికే ఖర్చు పెట్టాలని ఆయన అన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Congress senior leader G Venkataswamy attacked party high command on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X