వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఎమ్మెల్యే రాజీనామా ఆమోదంపై బాబు అసంతృప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

chandrababu naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజీనామాను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించడం పట్ల టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్లపురెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ కొవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డిపై ఫిర్యాదు చేసినప్పటికీ దానిని పక్కన పెట్టి అతని రాజీనామా ఆమోదించంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయం అప్రజాస్వామికంగా ఉందని నేతల వద్ద వ్యాఖ్యానించారు.

నల్లపురెడ్డి పార్టీ ఫిరాయించినందున అనర్హత వేటు వేయాలని ఏడాది కిందటే ఫిర్యాదు చేసినప్పటికీ విచారణ పేరుతో కాలాయాపన చేసి ఇప్పుడు స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించడం ఫిరాయింపుల చట్టస్ఫూర్తికి విరుద్ధమన్నారు. కాగా శనివారం సాయంత్రం చంద్రబాబు తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నల్లపురెడ్డి, తెలంగాణ నగారా సమితి చైర్మన్, నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డిల రాజీనామా ఆమోదం చర్చకు వచ్చింది.

English summary
TDP chief Nara Chandrababu Naidu unhappy with YSRC Party president YS Jaganmohan Reddy's TDP mla Nallapureddy Prasanna Kumar Reddy's resignation accept.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X