హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు! నిజాయితీ నిరూపించుకో: బొత్స సత్తిబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిబిఐ విచారణకు సహకరించి తన నిజాయితీ నిరూపించుకోవాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం సూచించారు. పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పిటిషన్ మేరకు హైకోర్టు బాబు ఆస్తులపై సిబిఐ ప్రాథమిక విచారణకు అదేశించిన విషయం తెలిసిందే. దీనిపై బొత్స స్పందించారు. బాబుకు తన నిజాయితీ నిరూపించుకునే అవకాశం వచ్చిందన్నారు. ప్రజాప్రతినిధులపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారి పైనే ఉందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో బాబు ఆస్తులపై పిటిషన్లు వేస్తే ఆయన కోర్టుకెళ్లి స్టేలు తెచ్చుకున్నారని ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు ఆరోపించారు. బాబు ఆస్తులపై విచారణను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఏలేరు, లిక్కర్ స్కాంలలో కేసులు వేస్తే స్టేలు తెచ్చుకున్నారన్నారు. బాబుపై ఏ కేసు వేసినా స్టే ద్వారా తప్పించుకో చూశారన్నారు. బాబు అవినీతిపరుడని పిల్లనిచ్చిన మామ, బావమరిది, అత్తగారు కూడా అన్నారని విమర్శించారు. దేశంలోనే అత్యంత ధనవంత రాజకీయ నాయకుడు బాబు అని తెహెల్కా ఎప్పుడో చెప్పిందన్నారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే కేసు విచారణ పూర్తయ్యేంత వరకు తన స్థానంలో టిడిపి అధ్యక్ష బాధ్యతలు వేరొకరికి అప్పగించాలన్నారు. తన నిజాయితీ నిరూపించుకున్న తర్వాతే ఆతను పార్టీ బాధ్యతలు తీసుకోవాలన్నారు.

English summary
PCC chief Botsa Satyanarayana suggested TDP chief Nara Chandrababu Naidu that he get chance to prove his sincerity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X