వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ నుండి పోటీ: నల్లపురెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

nallapureddy prasanna kumar reddy
హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాను కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండే పోటీ చేస్తానని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కొవురూ మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోమవారం స్పష్టం చేశారు. తాను త్వరలో వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతానని చెప్పారు. నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారితో చర్చించిన అనంతరం పార్టీలో చేరబోయే తేది తెలియజేస్తానన్నారు.

కాగా అంతకుముందు వైయస్ జగన్ నల్లపురెడ్డి, పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. వీరి మధ్య రాజీనామాల అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం స్పీకర్ నాదెండ్ల మనోహర్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజీనామా ఆమోదించిన విషయం తెలిసిందే. నల్లపురెడ్డి గత ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి గెలుపొందారు.

English summary
Former MLA Nallapureddy Prasanna Kumar Reddy clarified today that he will contrest from YSR Congress Party in next election. He said he will join in Jagan party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X