వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భన్వరీ దేవి ఎఫెక్ట్: రాజస్థాన్ మంత్రివర్గం రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

Ashok Gehlot
జోధ్‌పూర్: వరుస వివాదాల్లో ఇరుక్కుంటూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ మంత్రివర్గమంతా రాజీనామా చేసింది. తమ రాజీనామా లేఖలను మంత్రులు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు అందించి, కొత్తగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. వరుస కుంభకోణాలతో రాజస్థాన్‌లోని కాంగ్రెసు ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. సెప్టెంబర్‌లో నర్సు భన్వరీ దేవి మాయమైన సంఘటన తీవ్రంగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసింది.

భన్వరీదేవితో ఇద్దరు కాంగ్రెసు నాయకులకు లైంగిక సంబంధాలున్నట్లు సిబిఐ నిర్ధారణకు వచ్చింది. వారిలో ఒకతను మాజీ మంత్రి. గత నెల వరకు మంత్రిగా ఉన్న మహిపాల్ మడెర్నా భన్వరీదేవితో రాసలీలలు నడుపుతున్న వీడియో వెలుగు చూసింది. భన్వరీదేవి మాయం కాగానే ఆ వీడియోను విస్తృతంగా పంపిణీ చేశారు. భన్వరీ దేవి దళితురాలు కాగా, మాడెర్నా జాట్‌ వర్గానికి చెందిన బలమైన నాయకుడు. గోపాల్‌గఢ్‌లో మియో ముస్లింలపై కాల్పుల సంఘటన కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. జాట్‌ల మాదిరిగా కాంగ్రెసుకు మియోలు మంచి ఓటు బ్యాంక్.

English summary
The ministers in CM Ashok Glottis's cabinet have resigned, so that new council of ministers can be announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X