వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోనేరు ప్రసాద్‌కు షరతులతో తాత్కాలిక బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Koneru Prasad
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నిందితుడైన స్టైలిష్ హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోనేరు ప్రసాద్‌కు తాత్కాలిక ఊరట లభించింది. కోనేరు ప్రసాద్‌కు కోర్టు మంగళవారం తాత్కాలికంగా బెయిల్ మంజూరు చేసింది. అయ్యప్ప దీక్షలో ఉన్న ఆయన శబరిమల వెళ్లడానికి కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరి వ్యక్తిగత పూచీకత్తుతో పాటు మరిన్ని షరతులు విధించింది. సెల్ ఫోన్ వాడరాదని, ఎవరితోనూ మాట్లాడకూడదని, సాక్షులను ప్రలోభ పెట్టకూడదని షరతులు పెట్టింది. అలాగే, పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని కూడా ఆదేశించింది. శబరిమల జైలు ఎస్కార్టుతోనే వెళ్లాలని, ఎస్కార్టు ఖర్చులు కూడా భరించాలని ఆదేశించింది.

కోనేరు ప్రసాద్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై 20 నుంచి 25 నిమిషాల పాటు వాదోపవాదాలు జరిగాయి. సిబిఐ కూడా శబరిమల వెళ్లడానికి కోనేరు ప్రసాద్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను పెద్దగా వ్యతిరేకించలేదు. తాను 1984నుంచి అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నానని, ఈసారి కూడా తాను శబరిమల వెళ్లాలని అంటూ తనకు బెయిల్ మంజూరు చేయాలని కోనేరు ప్రసాద్ కోర్టును కోరారు. శబరిమల వెళ్లడానికి కోనేరు ప్రసాద్ రేపు బుధవారం విడుదలవుతారు. ఆయన ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది.

English summary
Stylish Homes MD Koneru Prasad was granted bail with conditions to visit Sabarimala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X