హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

33 నెలల తర్వాత తొలిసారి తగ్గిన పెట్రోల్ ధర

By Pratap
|
Google Oneindia TeluguNews

Petrol Hike
న్యూఢిల్లీ: పెరగడమే తప్ప తరగడం తెలియని పెట్రోల్ ధరలు మంగళవారం తగ్గుతున్నాయి. తగ్గిన పెట్రోల్ ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 2.25 పైసలు తగ్గింది. హైదరాబాదులో తగ్గింపు రూ. 1.85 పైసలు ఉన్నట్లు సమాచారం. 2009 జనవరి నుంచి పెట్రోల్ ధర తగ్గడం ఇదే మొదటిసారి. అంటే 33 నెలల తర్వాత పెట్రోల్ ధర దేశంలో తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గడంతో పెట్రోల్ ధర తగ్గింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్‌కు రూ. 1.80 పైసలు పెంచిన తర్వాత ఇప్పుడు పెట్రోల్ ధరలు తగ్గాయి.

పెట్రోల్ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ఇటీవల నిరసన వ్యక్తమైంది. తృణమూల్ కాంగ్రెసు నేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెట్రోల్ ధర పెంపుపై కాంగ్రెసు మీద తీవ్రంగా మండిపడ్డారు. యుపిఎ ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని కూడా ఆమె బెదిరించారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ ధర తగ్గిస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ తృణమూల్ కాంగ్రెసు ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.

English summary
Petrol prices in the country has been slashed by about Rs 2.25 per litre with effect from Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X