వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎంపిల రాజీనామాల తిరస్కరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Meera Kumar
న్యూఢిల్లీ: తెలంగాణ లోకసభ్యుల రాజీనామాలను కూడా స్పీకర్ మీరా కుమార్ తిరస్కరించారు. ఈ విషయాన్ని పార్లమెంటు సంయుక్త కార్యదర్శి పార్లమెంటు సభ్యులకు మంగళవారం తెలిపారు. తెలంగాణపై 9 మంది కాంగ్రెసు, ఇద్దరేసి తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) లోకసభ సభ్యులు జులై 4వ తేదీన రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెసు లోకసభ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామాలను పెండింగులో పెట్టారు. ఢిల్లీకి రావాల్సిందిగా వారిద్దరికి స్పీకర్ కార్యాలయం సమాచారం అందించింది. సిబిఐ ఎఫ్ఐఆర్‌లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు నిరసనగా మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామా చేశారు. ప్రస్తుత స్థితిలో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుల రాజీనామాలు ఆమోదించడం సరి కాదని స్పీకర్ కార్యాలయం అభిప్రాయపడింది. తమ రాజీనామాలకు పార్లమెంటు సభ్యులు చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని స్పీకర్ అభిప్రాయపడ్డారు. తొలుత మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామాతో పాటు తెలంగాణ పార్లమెంటు సభ్యుల రాజీనామాలను అన్నింటినీ స్పీకర్ తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి.

తెలంగాణపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రాజీనామాలపై తొందరపడవద్దని స్పీకర్ గతంలో ఓసారి కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులకు సూచించారు. తాము పార్లమెంటుకు వెళ్లి తెలంగాణ కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. పార్లమెంటు వేదిక తెలంగాణవాణి వినిపిస్తామని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. అవసరమైతే మళ్లీ రాజీనామాలు చేస్తామని ఆయన చెప్పారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇదిలావుంటే, తెలంగాణలోని ఆత్మహత్యలపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే నెల 14వ తేదీకి వాయిదా పడింది. తెలంగాణలోని ఆత్మహత్యలకు సోనియా గాంధీదే బాధ్యత అంటూ న్యాయవాది పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

English summary
Loksabha Speaker Meera Kumar rejected Telangana MPs resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X