హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సుప్రీంకోర్టుకు వెళ్లకూడదని చంద్రబాబు నిర్ణయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తనపై కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అప్పీలుకు వెళ్లరాదని ఆయన నిర్ణయించుకొన్నారు. హైకోర్టు ఆదేశాలతో విచారణ ఎదుర్కొంటున్న తన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలను కూడా అప్పీలుకు వెళ్లరాదని ఆదేశించారు. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్‌లను ఈ కేసులో ప్రతివాదులుగా పేర్కొంటూ వైఎస్ విజయమ్మ పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో వీరందరిపైనా సీబీఐ, ఈడీ, సెబీ, రాష్ట్ర హోం శాఖ, డీజీపీల ఆధ్వర్యంలో విచారణ జరగనుంది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

హైకోర్టు ఆదేశాలు ఏకపక్షంగా ఉన్నాయన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో కూడా బలంగా ఉన్నందువల్ల అప్పీలుకు వెళ్తే న్యాయం జరుగుతుందని కొందరు నేతలు వాదించారు. అప్పీలుకు వెళ్లకపోతే అనవసరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతికి జుట్టు ఇచ్చినట్లవుతుందని, వారి వేధింపులకు గురికావాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. మరి కొందరు నేతలు దీనికి ఒప్పుకోలేదు. వెళ్లకపోతేనే ప్రతిష్ఠ పెరుగుతుందన్నారు. వీరందరి అభిప్రాయాలు విన్న తర్వాత చంద్రబాబు తన అభిప్రాయం ప్రకటించారు. తాను అప్పీలుకు వెళ్లబోనని, తనకు అన్యాయం జరిగినా అప్పీలుకు వెళ్లదల్చుకోలేదని, దీనివల్ల ఏ పరిణామం ఎదురైనా తాను ఎదుర్కుంటానని ఆయన పార్టీ నాయకులతో చెప్పారు. తమ వాదనను చెప్పుకోవడానికి న్యాయస్థానంలో అవకాశం దొరకకపోవడంతో తమ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలని పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు.

English summary
TDP president N Chandrababu Naidu has decided not appeal in Supreme Court on High Court orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X