హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్‌తో జగన్ వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Dwarampudi Chandrasekhar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నుంచి శానససభ్యులు ఒక్కరొక్కరే జారిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు అనిపిస్తోంది. తాజాగా, వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పడిన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ అర్భన్ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. శానససభ్యుడు ఆళ్ల నాని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండలో పాల్గొన్న మర్నాడే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పెండింగులో ఉన్న రాజీనామాల దుమ్ము దులుపుతున్న నేపథ్యంలో జగన్‌తో ఉండేవారెవరో, జారిపోయేవారెవరో కచ్చితంగా తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.

గత ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి పట్టుబట్టి వైయస్ జగన్మోహన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేత టికెట్ ఇప్పించారని అంటారు. కాకినాడ అర్బన్‌లో ప్రాబల్యం ఉన్న ముత్తా గోపాలకృష్ణను కాదని వైయస్ రాజశేఖర రెడ్డికి టికెట్ ఇప్పించారు. దాంతో ముత్తా గోపాలకృష్ణ తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగినా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గెలిచారు. కాంగ్రెసు నుంచి బయటపడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో జగన్ వెంట ఉండే ముఖ్యమైన శాసనసభ్యుల్లో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఒక్కరని భావించారు. కానీ, ద్వారంపూడి క్రమంగా జగన్‌కు దూరమవుతూ వస్తున్నట్లు చాలా కాలం నుంచి ప్రచారం సాగుతోంది.

English summary
Kakinada Urban MLA, Dwarampudi Chandrasekhar Reddy, belongs to YS Jagan camp met CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X