గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈనాడు, టివి9ది వైయస్‌ను ఇరికించే యత్నం: జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, టివి 9, కాంగ్రెసు పార్టీ అంతా కలిసి దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలోని రెండో విడత ఓదార్పు యాత్ర ప్రారంభం సందర్భంగా విమర్శించారు. సిబిఐ అంటే కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిందన్నారు. శాసనసభ్యులు వెంట లేకపోయినా రాష్ట్రమంత కుటుంబం తనకు తోడుగా ఉందని అన్నారు. ఓ తల్లిని, బిడ్డను ఎదుర్కొనేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు.

కాగా జగన్ ఉదయం రేపల్లె మండలం పేటేరు నుంచి తన ఓదార్పు యాత్రను ప్రారంభించారు. రేపల్లె మండలంలోని మునుసుబువారిపాలెం, అరసవల్లి, ఊలుపాలెం, నల్లూరిపాలం తదితర గ్రామాల్లో జగన్ దివంగత వైయస్ విగ్రహాలు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత రేపల్లె పట్టణంలో పలుచోట్ల ఓదార్పు యాత్ర చేపడతారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy accused Eenadu, Andhrajyothy, TDP, Congress and TV9 that they will trying to create Late YSR as accuse in several cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X