India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదుకు వచ్చిన శ్రీలక్ష్మి, ఒక్కటే ప్రయత్నాలు

By Pratap
|
Google Oneindia TeluguNews
Srilakshmi
హైదరాబాద్: అనారోగ్యం పేరుతో సెలవు పెట్టి చెన్నై వెళ్లిన ఆమె హైదరాబాదుకు తిరిగి వచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాల కేసులో ఆమె నాలుగో ముద్దాయి. ఇప్పటికే ముగ్గురు అరెస్టయిన నేపథ్యంలో సిబిఐ అధికారులు ఆమెను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీని నుంచి తప్పించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదు వచ్చినప్పటికీ ఆమె విధులకు హాజరు కాలేదు. ఆమె ఆరోగ్య శాఖలో నిర్వహిస్తున్న బాధ్యతలను ప్రభుత్వం మరో అధికారికి అప్పగించింది.

అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఆమె రాజకీయ నాయకులను, మాజీ ఐఎఎస్ అధికారులను ఆశ్రయిస్తున్నట్లు చెబుతున్నారు ఎపి ఐఎఎస్ అధికారుల సంఘం నాయకులను కూడా ఆమె కలిసి - తనను ఈ ముప్పు నుంచి కాపాడాలని కోరినట్లు చెబుతున్నారు. తాను నిబంధనల మేరకే వ్యవహరించానని ఆమె వారి వద్ద తన గోడును వెళ్లబోసుకున్నారని వార్తలు వచ్చాయి. గనుల లీజుకు సంబంధించి సిబిఐ అధికారులు ఆమె ఇప్పటికే పలు మార్లు విచారించారు.

English summary
Srilakshmi returned to Hyderabad on Wednesday and is said to be closeted with her well-wishers in discussing her next plan of action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X