India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి జనార్దన్ రెడ్డి కోటలో సిబిఐ గూఢచారి పాగా?

By Pratap
|
Google Oneindia TeluguNews
Gali Janardhan Reddy
న్యూఢిల్లీ: చుట్టూ రక్షణ వలయంలో ఉండే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కోటలో సిబిఐ గూఢచారి ప్రాణాలకు తెగించి పాగా వేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ ఆంగ్ల దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించడానికి సిబిఐ అధికారి ఒకరు గాలి రక్షణ బృందంలోకి రహస్యంగా ప్రవేశించినట్లు తెలుస్తోంది. తద్వారా గాలి కదలికలపై, కార్యకలాపాలపై పాగా వేసి ఆయన అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు తెలుస్తోంది. చేతులు తడపడం, రాజకీయ సంబంధాలను దుర్వినియోగం చేయడం, కర్ణాటక - ఆంధ్ర సరిహద్దులను చెరిపేయడం, నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించడం వంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సిబిఐ అధికారి దగ్గరుండి సేకరించినట్లు చెబుతున్నారు.

బళ్లారిలోని గాలి భవనం ముందు కుటీరంలోకి సిబిఐ తన మనిషిని మూడో మనిషికి తెలియకుండా ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా ఆయన ఇంటిపై దాడులు చేయడానికి మూడు నెలల ముందు చేరినట్లు తెలుస్తోంది. సిబిఐ గూఢచారి క్రమంగా తన బాస్‌ల విశ్వాసాన్ని పొందడమే కాకుండా గాలి జనార్దన్ రెడ్డి ఆంతరంగికులకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయాడు. దాన్ని ఆసరాగా తీసుకుని అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సిబిఐకి చేరవేస్తూ వచ్చాడు. ఏ మాత్రం అనుమానం రాకుండా అతను వ్యవహరిస్తూ వచ్చాడు. నిజానికి, ఎవరి మీదనైనా అనుమానం వస్తే వెంటనే ఉద్యోగంలోంచి తీసేస్తారు.

సిబిఐ దాడులు జరగడానికి మూడు రోజుల ముందు సిబిఐ గార్డు ఆరోగ్యం, కుటుంబ సమస్యలు కారణంగా చూపి ఉద్యోగాన్ని వదిలేశాడు. అప్పుడు కూడా అతనిపై గాలి జనార్దన్ రెడ్డికి అనుమానం రాలేదు. ఇంటిపై దాడి చేసినప్పుడు సిబిఐ బృందంలో తన పాత ఉద్యోగి ఉండడం చూసి గాలి జనార్దన్ రెడ్డి షాకయ్యాడని ఆ ఆంగ్ల పత్రిక రాసింది. అత్యంత పకడ్బందీగా వ్యవహరించిన సిబిఐ గాలి జనార్దన్ రెడ్డి ఇంటిపై దాడి చేసి ఆయనను అరెస్టు చేసింది.

English summary
It wasn’t an easy task for the Central Bureau of Investigation (CBI) to infiltrate into the strongly-guarded citadel of former Karnataka tourism minister and mining baron Gali Janardhan Reddy, so it laid a master plot to nail him in the illegal mining scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X