వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఆస్తుల కేసు: ఐటి పిటిషన్‌పై 21న కోర్టు నిర్ణయం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అస్తులు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుల్లో అదాయం పన్ను శాఖ పిటిషన్లపై నిర్ణయాన్ని హైదరాబాదు నాంపల్లి కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 21వ తేదీన వెలువరించనుంది. సిబిఐ స్వాధీనం చేసుకున్న పత్రాలను తమకు ఇప్పించాలని కోరుతూ ఆదాయం పన్ను (ఐటి) శాఖ కోర్టులో పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో శుక్రవారం వాదప్రతివాదనలు ముగిశాయి. కోర్టు నిర్ణయాన్ని ఈ నెల 21వ తేదీ వరకు రిజర్వ్ చేసుకుంది.

జగన్ నివాసాల్లో, కంపెనీల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను తమతో పంచుకోవాలని సిబిఐని ఆదేశించాలని కోరుతూ గత నెల బెంగళూర్, హైదరాబాద్ ఐటి అధికారులు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పత్రాలను తమకు అప్పగిస్తే వాటి ఆధారంగా జగన్‌కు సంబంధించి, ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించి పెండింగు అంచనాలను పూర్తి చేస్తామని ఐటి అధికారులు కోర్టుకు చెప్పుకున్నారు. సిబిఐ స్వాధీనం చేసుకున్న అన్నింటినీ ఐటి శాఖకు ఇవ్వాల్సిన అవసరం లేదని జగన్ తరఫు న్యాయవాది వాదించారు.

English summary
Nampally court on Friday posted for orders to November 21, the petitions of income tax Department, seeking copies of documents, seized by the CBI during the probe of corruption charges against Kadapa MP YS Jaganmohan Reddy and the alleged irregularities in the Emaar Properties land deal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X